నమస్తే శేరిలింగంపల్లి: అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని జేపీ నగర్ రోడ్డు లోని వీ9 మెన్స్ వెర్ నుండి అరబిందో కాలనీ వరకు రూ.20 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే ఓపెన్ నాలా పునరుద్ధరణ, వరద నీటి కాలుచ పై స్లాబ్ ల నిర్మాణ పనులకు, శ్రీరంగాపురం వీ9 మేన్స్ వేర్ వద్ద రూ.23.00 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాల్వ) నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. సీఎం కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రివర్యులు కెటిఆర్ సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదితానని పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగిందన్నారు. వరద నీటి కాలువ పునరుద్దరణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో రాజీ పడేది లేదన్నారు. ప్రజలకు ట్రాఫిక్ సమస్య లేకుండా చూస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ రూపా దేవి, ఏఈ ధీరజ్,ఏఈ అనురాగ్, వర్క్ ఇన్ స్పెక్టర్లు విశ్వనాథ్, జగదీష్, ప్రేమ్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీ నారాయణ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు పురుషోత్తం యాదవ్, మోహన్ ముదిరాజ్, ముప్పవరపు గంగాధర్ రావు, మాధవరం గోపాల్ రావు, బి యస్ ఎన్ కిరణ్ యాదవ్, జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్, సంతోష్, రాజు గౌడ్, విజయ్, వెంకటేష్, శివ, మల్లేష్ మహిళ నాయకురాలు రోజా, సుప్రజ, స్వరూప, కాలనీ అధ్యక్షులు రాంబాబు, నారాయణ రెడ్డి, బాల్ రెడ్డి, అభినవ రెడ్డి, శ్రీనివాస్, రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.