నమస్తే శేరిలింగంపల్లి:చందానగర్ సర్కిల్ పరిధిలోని ఇళ్లల్లో నుంచి చెత్త సేకరణ కోసం సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందజేసిన 9 స్వచ్ఛ ఆటోలను శుక్రవారం చందానగర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ లబ్ధిదారులకు అందజేశారు. చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్, చందానగర్ డిప్యూటీ కమిషనర్ సుదాంషు తో కలిసి కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చందానగర్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో స్వచ్ఛ ఆటోలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వేళ స్వచ్ఛత చాలా అవసరమని, కాలనీల్లోకి వచ్చే స్వచ్ఛ ఆటోల్లో ప్రతి ఒక్కరూ చెత్తను వేయాలన్నారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖామంత్రివర్యులు కేటీఆర్ నాయకత్వంలో స్వచ్ఛతను, పారిశుద్ధ్యాన్ని ఒక ప్రాధాన్యంగా తీసుకొని 2015లో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. స్వచ్ఛ ఆటోల ద్వారా ఎంతో మందికి జీవనఉపాధి కల్గించడం జరుగుతుందని, ప్రభుత్వమే రు.6.95లక్షల విలువ చేసే ఆటోలను సబ్సిడీ ద్వారా రు.5.95లక్షలను రుణాలను అందించడం జరుగతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ కార్తిక్, శానిటేషన్ సూపర్ వైజర్ శ్రీనివాస, టీఆర్ఎస్ నాయకులు రఘునాథ్ రెడ్డి, జాకీర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.