నమస్తే శేరిలింగంపల్లి: కమ్మ వారి సేవా సంఘం సమాఖ్యకు శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ ఖానామెట్ గ్రామంలో సర్వే నంబర్ 41/14 లో, ఐదెకరాల స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో ఉత్తర్వులు జారీ చేసిన శుభసందర్భంగా కమ్మ వారి సంఘాల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ ని ఆల్విన్ కాలనీ డివిజన్ కి చెందిన కమ్మ సంఘం సభ్యులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. కమ్మ సేవా సంఘం భవనానికి స్థలం కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కమ్మ సామాజికం కుటుంబ సభ్యుల తరుపున ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల భవన నిర్మాణాల కోసం స్థలాలు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఆదర్శప్రాయులు అని అన్నారు. ఈ స్థలములో చేపట్టబోయే భవన నిర్మాణములో విద్యార్ధుల కు వసతి గృహం, విద్య నైపుణ్యాలు పెంపొందించడానికి ప్రత్యేక శిక్షణ కేంద్రం, పెళ్లి ల కోసం కన్వెన్షన్ సెంటర్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా అన్ని హంగులతో, సకల సౌకర్యాల తో భవన నిర్మాణం చేపడుతాం అని అన్నారు. త్వరలోనే అందరి సమిష్టి కృషి తో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు గాంధీ చెప్పారు. ఈ కార్యక్రమంలో అల్విన్ కాలనీ డివిజన్ కమ్మ సంఘం సభ్యులు వి. రామకృష్ణ, రత్న ఈశ్వరరావు , రత్నా రావు, కట్టా శ్రీనివాస్, బొప్పన మధు, ప్రభాకర్ , కాపా శ్రీనివాసరావు, హరిబాబు, రామకృష్ణ, నాగేశ్వరరావు, వంశీ, మురళి , కటారి సత్యం తదితరులు ఉన్నారు.