సత్యనారాయణ, శారద కుటుంబానికి మిరియాల ప్రీతం ఆర్థిక స‌హాయం

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ ఇందిరానగర్ బస్తీకి చెందిన సత్యనారాయణ, శారద కుటుంబం ఇటీవల పలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంద‌ని, కొడుకు, కోడలు మరణంతో వారి పిల్లల చదువుల‌కు ఇబ్బందులు క‌లుగుతున్నాయ‌ని స‌మాచారం తెలుసుకున్న మిరియాల ప్రీతం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతం మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించాల‌ని, తద్వారా నానమ్మ తాతల్ని గౌరవంగా చూసుకోవాలని, వారి కుటుంబానికి తగిన సహాయం అందించాలని తెలిపారు. ప్రజల్లో కూడా సానుభూతి కలిగి ఈ కుటుంబానికి తోచినంత ఆర్థిక సహాయం అందించాల‌ని పిలుపునిచ్చారు. మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ‌ని, సమాజంలో ఇలాంటి బాధిత కుటుంబాలకు ముందుండి సహాయం అందించాలనే సంకల్పంతో ప‌నిచేస్తున్నామ‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here