శేరిలింగంపల్లి, నవంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ జన్మదినం సందర్భంగా బిసి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన సందర్భంగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జననాయకుడిగా మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని అన్నారు. జన నాయకుడిగా జన సమస్యలను పరిష్కరిస్తూ, జననేతగా నిలవాలని అన్నారు. నవీన్ యాదవ్ మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మరిన్ని ముఖ్యమైన పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు పెరుగు ఐలేష్ యాదవ్, సర్పంచుల పూర్వ వ్యవస్థాపక అధ్యక్షుడు సౌధాని భూమన్న యాదవ్, పాములేటి యాదవ్, కరీంనగర్ చిగుర్ల రాజు యాదవ్, అందిన కిరణ్ యాదవ్, బీసీ నాయకులు పాల్గొన్నారు.






