శిల్పారామంలో ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ మేళా ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్‌లోని శిల్పారామంలో మెగాక్లస్టర్ CHCDS (కాంప్రెహెన్సివ్ హాండి క్రాఫ్ట్ క్లస్టర్ డెవలప్మంట్ స్కీం) లో భాగంగా డెవలప్ మెంట్ కమిషనర్ (హాండి క్రాఫ్ట్), మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్, భారత ప్రభుత్వంచే ఆమోదించబడి వారి సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఆధ్వ‌ర్యంలో నిర్వహించే గాంధీ శిల్ప బజార్ (GSD) ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ మేళాను సోమ‌వారం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి హైద‌రాబాద్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో & సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్ అడిషనల్ డైరెక్టర్ శ్రుతి పాటిల్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ప్ర‌భుత్వం డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ (MSME) K. మధుకర్ బాబు, హ్యాండి క్రాఫ్ట్ స‌ద‌ర‌న్ రీజియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ క‌మిష‌న‌ర్‌, రీజిన‌ల్ డైరెక్ట‌ర్ ఎ.ల‌క్ష్మ‌ణ రావు, మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఇంచార్జ్ & మెంబర్ ఆఫ్ స్టాండింగ్ కమిటీ K. లక్ష్మా రెడ్డి, శిల్పారామం స్పెష‌ల్ ఆఫీస‌ర్ జి.కిష‌న్ రావు, హ్యాండి క్రాఫ్ట్ డెవ‌ల‌ప్‌మెంట్ క‌మిష‌న‌ర్‌, హైద‌రాబాద్ స‌ర్వీసెస్ సెంట‌ర్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఎం.సువ‌ర్చ‌ల‌, ఏపీపీసీ హాన‌ర‌రీ ట్రెజ‌ర‌ర్ పులి రాజా రెడ్డి పాల్గొన్నారు.

ఈ మేళాలో కాశ్మీర్‌, ఉత్త‌ర ప్ర‌దేశ్, బీహార్‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, ఏపీ, తెలంగాణ‌, ఢిల్లీ రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు హ‌స్త‌క‌ళ‌ల‌, చేతి వృత్తుల‌, చేనేత క‌ళాకారులు స్టాల్స్ ఏర్పాటు చేసి త‌మ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రొడ‌క్టివిటీ కౌన్సిల్, కార్య‌క్ర‌మ నిర్వాహ‌క సంస్థ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ టి. శ్రీ‌నివాస్ రఘు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ గణపతి నృత్యాలయ నాట్యగురువు రసీమాతి అనురాధ శిష్య బృందం ప్ర‌ద‌ర్శించిన‌ పేరిణి, ఆంధ్రనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. వినాయక గద్యం, బ్రహ్మ గద్యం, రామచంద్రయ్య, దేవీస్తుతి, సంధ్య తాండవం మొదలైన అంశాలను ప్రదర్శించి మెప్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here