శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శివాజీ నగర్లోని కట్ట మైసమ్మ దేవాలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో అన్నప్రసాదం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వివేకానంద యూత్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతం ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలను అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ప్రజలపై ఉండి వారికి ఐశ్వర్యం, ఆయురారోగ్యం, శాంతి, సంతృప్తి ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను అని తెలిపారు. అన్నప్రసాదంలో స్థానిక కాలనీవాసులు, మహేష్, వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు.






