శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని హుడా ట్రేడ్ సెంటర్ సీనియర్స్ సిటిజెన్ భవన్ లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ (గుండె) దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని సిటిజన్ హాస్పిటల్ నల్లగండ్ల సౌజన్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పాతూరి అవినాష్ (కార్డియాలజిస్టు) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణంలో వచ్చే పెను మార్పులతో మారిన జీవనశైలితో మానవుడు గుండె జబ్బులతో సతమతమవుతున్నాడని అన్నారు. గుండె జబ్బులు రోజురోజుకు అధికమవుతున్నాయని, దీని వల్ల ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం జరుగుతుందన్నారు. నష్ట నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (హెచ్ డబ్ల్యు ఓ ), వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంయుక్తంగా 2011వ సంవత్సరం సెప్టెంబర్ 29 నుండి ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ సంవత్సరం నినాదం బీట్ ను దాటవేయవద్దు అని, ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం గుండెను ఆరోగ్యంగా చూసుకోవడమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆదిత్, సీనియర్స్ సిటిజెన్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఫ్రొఫెసర్ జయంత్ కుమార్, జి నరసింహారావు , వేణుమోహన్ రావు , పాండురంగయ్య , కాశీ విశ్వనాధ్ , వి యాదయ్య, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, కొక్కుల జనార్ధన్, పాలం శ్రీను, శివరామకృష్ణ, విష్ణు ప్రసాద్, ప్రేమ్ సింగ్, హాస్పటల్ ప్రతినిధి జాకీర్ , శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.






