శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనాభా లెక్కల్లో కులగణన చేపట్టి, ఓబీసీ కులాలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ హక్కుల పరిరక్షణ కోసం బీసీ ఉద్యమ నాయకుడు హనుమంతరావు హైదరాబాద్లో నిర్వహించిన నిరాహార దీక్షకు యువ నాయకుడు మిరియాల ప్రీతమ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ బీసీ వర్గాలకు న్యాయం జరగాలంటే కులగణన అత్యంత అవసరమని పేర్కొన్నారు. సమాజంలో బీసీలకు తగిన గుర్తింపు, హక్కులు రావాలంటే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. హనుమంతరావు చేపట్టిన ఈ దీక్ష బీసీల ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక అని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మిరియాల రాఘవరావు, త్రిలోచన్, చందానగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు, పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






