శేరిలింగంపల్లి, ఏప్రిల్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ బస్తీలో ఉన్న అంగన్‌వాడీ పాఠశాలకు మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మిరియాల ప్రీతమ్ సహాయం చేశారు. ఉపాధ్యాయురాలు బాలమణి విజ్ఞప్తి మేరకు తీవ్రమతున్న ఎండల దృష్ట్యా చిన్నారులకు స్వచ్ఛమైన చల్లని తాగునీరు అందుబాటులో ఉండేందుకు వాటర్ ప్యూరిఫైయర్‌తో కూడిన ఫ్రిజ్‌ను అందజేశారు. స్థానిక వృద్ధుల అభ్యర్థన మేరకు కూర్చునేందుకు సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంజాద్, వంశీ, మాణిక్యం, టీచర్ బాలామణి, బస్తీ ప్రజలు పాల్గొన్నారు.






