శేరిలింగంపల్లి, జూలై 19 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిరియాల ప్రీతమ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన సహాయం అందించడం ద్వారా మిరియాల ప్రీతమ్ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ఇన్‌చార్జ్ జగదీశ్వర్ గౌడ్, ఎంబీసీ మాల్ చైర్మన్ జెరిపాటి జైపాల్, మాజీ కార్పొరేటర్ రఘునాథ్ రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, రాగం నాగేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వారు మిరియాల ప్రీతమ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను అభినందించారు.





