శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): నల్లగండ్ల డివిజన్ పరిధిలోని NTR నగర్లో బాలకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్లగండ్ల BRS పార్టీ నాయకుడు హరిశంకర్ యాదవ్‌తో కలిసి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో బాలకృష్ణ, వెంకట్ రెడ్డి, నారాయణ, సురేష్‌తో పాటు స్థానిక BRS నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






