మియాపూర్ న్యూ కాలనీ మార్కెట్‌లో జూట్ బ్యాగుల పంపిణీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ న్యూ కాలనీ మార్కెట్‌లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం – పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ స్థానిక వ్యాపారులు, ప్రజలకు జూట్ (జనపనార) బ్యాగులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ భూమిలో కరిగిపోవడానికి వందల ఏళ్లు పడుతుందని, దీని వల్ల భూగర్భ జలాలు, పర్యావరణం, ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. నిత్య జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, జూట్, క్లాత్ సంచులను వినియోగించే అలవాటును పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని తగ్గించి క్లాత్, జూట్ బ్యాగుల వాడకాన్ని పెంచాలని కోరారు. మార్కెట్‌లోని వ్యాపారులు వినియోగదారులకు ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను అందించాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలనే సంకల్పంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక వ్యాపారులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తామని పలువురు స్వచ్ఛందంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో నాగులు గౌడ్, లక్ష్మణ్, గణేష్, శివబాషా, రాము, వేణుగోపాల్ రెడ్డి, పవన్ యాదవ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here