పోష‌కాహారంతో గ‌ర్భిణీలు, బాలింత‌ల‌కు ఆరోగ్యం: ఐసీడీఎస్ ఆఫీస‌ర్ క‌విత

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పోష‌క విలువ‌ల‌తో కూడిన ఆహారం తీసుకుంటే గ‌ర్భిణీలు, బాలింత‌లు, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటార‌ని ఐసీడీఎస్ శేరిలింగంప‌ల్లి ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ క‌విత అన్నారు. 9వ జాతీయ పోష‌ణ మాసం సంద‌ర్బంగా బుధ‌వారం ఆదిత్య న‌గ‌ర్ సెక్టార్ ప‌రిధిలోని ప్రేమ్ న‌గ‌ర్‌లో మార్తాండ‌న‌గ‌ర్‌, ప్రేమ్ న‌గ‌ర్ అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్తల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి ఆమె ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. న్యూట్రిష‌న్ డే సంద‌ర్భంగా త‌యారు చేసిన 21 వంట‌కాల గురించి త‌ల్లులంద‌రికీ వివ‌రించి గ‌ర్భిణీల‌కు, త‌ల్లుల‌కు, పిల్ల‌ల‌కు పౌష్టికాహారాన్ని అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐసీడీఎస్ ఆదిత్య‌న‌గ‌ర్ సెక్టార్ సూప‌ర్ వైజ‌ర్ లోవ కుమారి, అంగ‌న్ వాడీ టీచ‌ర్లు శైల‌జ‌, ల‌క్ష్మీకాంతం, మ‌ణిజ్యోతి, నాగ‌శ్రీ‌ల‌త‌, ల‌క్ష్మీ ప్ర‌వీణ‌, కల్యాణి, షీబా, ఖైరున్నీసా, శ్వేత‌, కాల‌నీవాసులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here