హఫీజ్‌పేట్‌లో గణేష్ మండపాలను దర్శించిన బాలింగ్ గౌతమ్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలో గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా డివిజన్‌లోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ దర్శించుకున్నారు. హఫీజ్‌పేట్‌లోని ప్రజయ్ సిటీ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపానికి బాలింగ్ గౌతమ్ గౌడ్ హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు కాలనీవాసులు, అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి రెడ్డి నాట్య కళాబృందానికి చెందిన చిన్నారులు ప్రదర్శించిన నృత్య కార్యక్రమాన్ని గౌతమ్ గౌడ్ వీక్షించారు. చిన్నారుల ప్రతిభను అభినందించి కళాకారులను ప్రోత్సహించారు.

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. గణేష్ నవరాత్రి వేడుకలను, సాంస్కృతిక కార్యక్రమాలను చక్కగా నిర్వహిస్తున్న కాలనీ అసోసియేషన్ సభ్యులను, కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here