అమ్మవారి దీవెనలు ఉంటే అన్నీ సమకూరుతాయి: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గోపన్‌పల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ చిత్తారమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్, ఎంబీసీ ఛైర్మెన్ జెరిపేటి జైపాల్, సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ ల‌తో క‌లిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికిపూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శాలువాతో సత్కరించారు. ఆలయ అర్చకులు వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం దాదాపు మూడు వేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాన‌ని అన్నారు. శ్రావణ మాసంలో బోనాల పండుగను తెలంగాణ ప్రజలు ఎంతో భక్తితో నిర్వహిస్తారని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ఒక ప్రతీక అని, అమ్మవారి దీవెనల కోసం బోనమెత్తే ప్రతి ఆడబిడ్డ హిందూ సంస్కృతికి నిజమైన వారసురాలు అని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో డివిజన్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని సీనియర్ నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ అధ్యక్షులు, బీజేపీ నాయకులు, దేవాలయ కమిటీ సభ్యులు , భక్తులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here