సరస్వతి విద్యా మందిర్‌లో ఘనంగా గురుపూర్ణిమ వేడుకలు

శేరిలింగంప‌ల్లి, జూలై 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్‌లోని సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో గురుపూర్ణిమ వేడుకలను విద్యార్థులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువులను పుష్పాలు, తాంబూలం, పండ్లు సమర్పించి సన్మానించి వారి ఆశీర్వాదాలు పొందారు. గురువుల పట్ల గౌరవం, కృతజ్ఞతల‌ను తెలియజేస్తూ విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమం ఆహూతులను ఆకట్టుకుంది. భారతీయ సంస్కృతిలో గురువు స్థానం అత్యున్నతమైనదని, గురువులను గౌరవించడం ప్రతి విద్యార్థి బాధ్యత అని పాఠశాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు వంగల్లు రామచంద్రారెడ్డి, కోశాధికారి జి. నాగభూషణరావు, కమిటీ సభ్యులు పి. దుర్గా మహేశ్వరరావు, కె. శ్రీపాల్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు అరుణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here