శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి పలువురు తెరాస మైనార్టీ నాయకులు శుక్రవారం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గాంధీని ఆయన నివాసంలో కలిసిన మైనార్టీ నాయకులు ఎండీ జహీరుద్దీన్, ఎండీ గౌస్, అఖిల్, ఆజంలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.






