నల్లగండ్ల చెరువు తూమును వెడల్పు చేయాలి

  • ప్ర‌భుత్వ‌విప్ ఆరెక‌పూడి గాంధీకి భేరి రామచందర్ యాదవ్ వినతి

గ‌చ్చిబౌలి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని న‌ల్ల‌గండ్ల చెరువు తూమును వెడ‌ల్పు చేయాల‌ని కోరుతూ ప్ర‌భుత్వ‌విప్ ఆరెక‌పూడి గాంధీకి నేతాజీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ శుక్ర‌వారం విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా రామ‌చంద‌ర్ యాద‌వ్ మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నేతాజీనగర్ కాలనీలో ఓపెన్ నాలాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పొంగి పొర్లాయ‌ని, అలాగే భారీ వ‌ర్షాల‌కు రోడ్లు ధ్వంస‌మ‌య్యాయ‌ని అన్నారు. ఆయా స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని కోరారు. అలాగే భారీ వ‌ర్షాలు ప‌డిన‌ప్పుడు న‌ల్ల‌గండ్ల చెరువు నిండి ఆ ప్ర‌వాహం తూము ద్వారా వెళ్తుంద‌ని, తూము వెడ‌ల్పు చిన్న‌గా ఉండ‌డం వ‌ల్ల ఆ నీరంతా కాల‌నీలోకి వ‌స్తుంద‌ని అన్నారు. క‌నుక తూమును వెడ‌ల్పు చేయాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేష‌న్‌ ఉపాధ్యక్షులు ఎండీ కమర్ పాషా, సురేష్, రాజు, మహిళా సంఘం ఉపాధ్యక్షులు కుమారి, విజయ, శ్యామల, దుర్గ, నిర్మల, యాదమ్మ, విమలమ్మ, రాధ‌, ప్రమీల, అంజమ్మ, సుశీల, యశోద, నర్మద, రుక్కమ్మ పాల్గొన్నారు.

ప్ర‌భుత్వ‌విప్ ఆరెక‌పూడి గాంధీకి విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న భేరి రామచందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here