నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పర్వదినం నిలిచిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజీ లో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ లలిత పోచమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన బోనాల మహోత్సవంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, నార్నె శ్రీనివాసరావు తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో బోనాల పండుగకు ప్రతిష్ట తీసుకువచ్చారన్నారు. బోనాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు మంజూరవడం జరిగిందన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ఈ సందర్భంగా వేడుకున్నట్లు ఎమ్మెల్యే గాంధీ చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, రవీందర్ రావు, లక్ష్మీ నారాయణ గౌడ్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, భారతి నగర్ ఎంఐజీ డివిజన్ ప్రెసిడెంట్ భాస్కర్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మిరియాల రాఘవరావు, జనార్దన్ రెడ్డి, సత్యనారాయణ, సురేందర్, నరేందర్ బల్ల, దాస్ తదితరులు పాల్గొన్నారు.
