శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 28 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ అఫ్ హార్టికల్చర్ వారు ఎనిమిదవ గార్డెన్ ఫెస్టివల్ లో యస్మీన్ బాషా ఐఏఎస్, డైరెక్టర్ ఫర్ హార్టికల్చర్ అండ్ సేరి కల్చర్ వారు శిల్పారామం మాదాపూర్ కి లాండ్స్కేప్ గార్డెన్ నిర్వహణకు గాను గోల్డ్ గార్డెన్ సర్టిఫికెట్, జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు. ప్రకృతి రమ్యంగా ఎల్లప్పుడూ పూల మొక్కలతో పచ్చని పచ్చిక బయళ్లతో సంవత్సరం మొత్తం శిల్పారామం కి విచ్చేసే సందర్శకులను ఎంతగానో ఆహ్లదపరుస్తున్న కారణంగా ఈ అవార్డు ని ఇచ్చి సత్కరించారు. శిల్పారామం కి ఈ గోల్డ్ గార్డెన్ అవార్డు రావడం చాలా సంతోషకరంగా ఉందని శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి. కిషన్ రావు తెలిపారు.