ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని హై టెన్షన్ రోడ్డులో ఉన్న జయనగర్ వినాయక మండపంలో అక్టోబర్ 31వ తేదీన మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. డివిజన్ పరిధిలోని జయ నగర్ కి చెందిన తెరాస నాయకుడు ఎక్కల్ దేవ్ శ్రీకాంత్ యాదవ్ జన్మదినం సందర్భంగా ఆ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరానికి చెందిన గోడ పత్రికను గురువారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం శిబిరాలను నిర్వహించి ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు, జయనగర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు.