- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): సమాజంలోని పేదలకు హోప్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. గురువారం హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కి చెందిన సరిత అనే మహిళకు ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా కుట్టు మిషన్ ను పంపిణీ చేశారు. అలాగే పలువురికి నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ పేదలకు సహాయం అందించడం కోసం దాతలు ముందుకు రావాలన్నారు. హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే తపన కలిగి ఉండడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకుడు సైదేశ్వర్ పాల్గొన్నారు.