- టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మిరియాల రాఘవ రావు
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): టీఆర్ఎస్ ప్రభుత్వం అందజేస్తున్న తక్షణ ఆర్థిక సహాయంతో పేద కుటుంబాల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మిరియాల రాఘవరావు అన్నారు. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు వరదల వలన నష్టపోయిన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సహాయం ప్రకటించిన నేపథ్యంలో గురువారం చందానగర్ లో వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని జీహెచ్ఎంసీ అధికారి కృష్ణతో కలిసి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మిరియాల రాఘవరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో ప్రతి వరద బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందన్నారు. వరదల వలన నష్టపోయిన బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఎవరూ కూడా అధైర్య పడవద్దని ప్రభుత్వం ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటుందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు యశ్వంత్, గిరి పాల్గొన్నారు.