క్లిష్ట‌మైన గుండె శ‌స్త్ర చికిత్స చేసిన మెడిక‌వ‌ర్ వైద్యులు

మాదాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్‌లోని మెడిక‌వ‌ర్ హాస్పిటల్ వైద్యులు దక్షిణ భార‌త దేశంలోనే ఎక్క‌డా లేని విధంగా ఓ యువ‌కుడికి అత్యంత కీల‌క‌మైన క్రిటిక‌ల్ కార్డియాక్ శ‌స్త్ర చికిత్స‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. ఈ మేర‌కు హాస్పిటల్ వైద్యులు మంగ‌ళ‌వారం వివ‌రాలను వెల్ల‌డించారు. నాగ్​పూర్​కు చెందిన 20 ఏళ్ల యువ‌కుడు మార్ఫన్ సిండ్రోమ్​తో కూడిన ఆర్టిక్ డిసెక్షన్ వ్యాధి (కణజాలాన్ని ప్రభావితం చేసే వారసత్వ రుగ్మత) తో బాధపడుతూ మెడికవర్​ హాస్పిటల్స్ కు వచ్చాడు. డాక్టర్​ ప్రమోద్​రెడ్డి, డాక్టర్​ శరత్​రెడ్డి టీమ్​ ఆ యువ‌కుడికి ‘సింగిల్​ స్టేజ్​ ఫ్రోజెన్​ ఎలిఫాంట్​ ట్రంక్​ టెక్నిక్’​ ఉపయోగించి అతన్ని ప్రాణాపాయస్థితి నుంచి బయటపడేశారు.

స‌మావేశంలో వివ‌రాల‌ను వెల్ల‌డిస్తున్న వైద్యులు

మార్ఫన్​ సిండ్రోమ్​ వ్యాధి మనిషి శరీరంలోని కణాలను ఎక్కువ ప్రభావం చేస్తుంది. ముఖ్యంగా ఎముకలు, చర్మం, గుండె, రక్తనాళాలు, ఊపిరితిత్తులు, కళ్లు, నాడీ వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న పేషెంట్​కి ఫ్లోరోస్కోపీ, ఐవీయూఎస్​ ఇమేజింగ్ ద్వారా సరైన మార్గాన్ని గుర్తించడానికి గైడ్ వైర్‌ను ప్రవేశపెట్టడంలో డాక్టర్​​ ప్రమోద్​రెడ్డికి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ రెడ్డి సహాయపడ్డారు. ఇది స్టెంట్​ను సరైన స్థానంలో పెట్టడానికి చాలా ముఖ్యమైన దశ అని చెప్పొచ్చు. కార్డియాక్​ టీమ్​ ఎంతో క్లిష్టమైన ఫ్రోజెన్​ ఎలిఫాంట్​ ట్రంక్​ ద్వారా సగానికి సగం ఆర్టిక్ (బృహద్ధమని)ని మూలాల నుంచి అమర్చి పేషెంట్​ ప్రాణాలను కాపాడారు.

మెడికవర్ హాస్పిటల్ చీఫ్ కార్డియోతొరాసిక్ అండ్ ఆర్టిక్ సర్జన్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ..”ఆర్టిక్ డిసెక్షన్ అనేది అత్యవసర పరిస్థితి. ఇందులో గుండె రక్తనాళాల్లోని లోపలి పొర విడిపోతుంది. దానివల్ల పేషేంట్​కి తీవ్రమైన ఛాతీ నొప్పి, వెన్నునొప్పి వస్తాయి. నెమ్మ‌దిగా ఆ నొప్పి మెడ, వెన్ను దిగువ భాగానికి చేరి శ్వాస సరిగా అందక మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు. ఈ ఆర్టిక్ డిసెక్షన్ అనేది చాలా అరుదుగా కనిపించే వ్యాధి. పురుషుల్లో ఇది ఎక్కువగా 60, 70 ఏళ్ల వయసులోనే కనిపిస్తుంది” అన్నారు.

ఈ పద్దతిలో పేషెంట్​ శరీరాన్ని 18‌‌–20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చల్లబర్చాలి. అలాగే 45 నిమిషాలపాటు ఒక్క మెదడుకు తప్ప మిగిలిన శరీర భాగాలకు రక్త ప్రసరణ ఆపేయాల్సి ఉంటుందని కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఇంత క్లిష్టమైన సర్జరీ తర్వాత ప్రస్తుతం ఆ పేషెంట్​ ఆరోగ్యం నిలకడగా ఉందని, అతను త్వరగా కోలుకుని మామూలు జీవితం గడుపుతాడని చెప్పారు. అలాగే సాధారణంగా ఇలాంటి కేసుల్లో మరణాల రేటు 30–40 శాతం వరకు ఉంటుందని, ఒక్కోసారి స్ట్రోక్​ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నారు డాక్టర్​ ప్రమోద్​ రెడ్డి. ఆయనతో ఈ సర్జరీలో పాల్గొన్న డాక్టర్​ శరత్​రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆర్టిక్​ డిసెక్షన్​ థెరపీలు చాలా క్లిష్టమైన పద్ధతులు. ఒక్కోరోజు ఆలస్యం అవుతున్నకొద్దీ మరణాల రేటు పదిశాతం పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ పద్ధతిని రెండు దశలుగా నిర్వహిస్తారు. కానీ మేము చాలా జాగ్రత్తగా స్పెషల్​ ట్యూబ్​ ద్వారా దీన్ని ఒకేదశలో పూర్తిచేశాం. ఈ ఫ్రోజెన్​ ఎలిఫాంట్​ ట్రంక్​ టెక్నికల్​ వల్ల అదనపు ఆపరేషన్ల అవసరం ఉండదు. పైగా లాంగ్​ టర్మ్​ సర్వవైల్ ఉంటుంది​” అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here