శేరిలింగంపల్లి, మార్చి 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అన్ని రకాల చర్యలను చేపడుతున్నామని సీఐ ప్రశాంత్ తెలిపారు. మియాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద టాటా మోటా్స్‌కు వచ్చే దారిలో మంజీరా పైప్ లైన్ లీకేజీ ఏర్పడిందని, దీని వల్ల ట్రాఫిక్‌ను వ్యతిరేక రోడ్డుకు మార్చినట్లు తెలిపారు. ఆ దారిలో సింగిల్ లేన్ యూసేజ్ ఉంటుందని, వాహనదారులు గమనించి సహకరించాలని కోరారు.






