ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, మే 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ, స్ప్రింగ్ వ్యాలీ కాలనీలలో రూ. 1 కోటి 24 లక్షల వ్య‌యంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు సీనియర్ నాయకుడు మారబోయిన రాజు యాదవ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 1650 కోట్ల నిధుల‌ను మంజూరు చేశార‌న్నారు. హఫీజ్‌పేట్ మంజీర రోడ్డు నుండి మసీదు బండకు వెళ్లే లింక్ రోడ్డులో ఉన్న రైల్వే అండర్ పాస్ వద్ద ఉదయం , సాయంత్రం తీవ్ర ట్రాఫిక్ సమస్య తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here