ఓపెన్ జిమ్ ఏర్పాటుకు స్థల పరిశీలన

శేరిలింగంప‌ల్లి, మే 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు స్థల పరిశీలన నిమిత్తం జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, శానిటేషన్ అధికారులు, కాలనీ వాసులతో కలసి మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓపెన్ జిమ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా త‌న దృష్టికి తీసుకువ‌స్తే ప‌రిష్క‌రిస్తామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ డిఈ మౌనిక, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, శానిటేషన్ డిఈ శంకర్ గణేష్, ఏఈ బన్సిపటేల్, SRP సత్యనారాయణ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here