శేరిలింగంపల్లి, డిసెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ శ్రీరామ్ నగర్ బీ బ్లాక్ లో నూతనంగా ఏర్పాటు చేసిన MD TENT HOUSE ను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా టెంట్ హౌస్ ఓనర్ అబ్దుల్ నబీ జన్మదినం సందర్బంగా మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా వ్యాపార రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అలాగే మరికొందరికి ఉపాధి కల్పించాలని, యువత యొక్క స్వయం ఉపాధి దేశాభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పురం విష్ణువర్ధన్ రెడ్డి, చాంద్ పాషా, శ్రీరామ్ నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మయ్య, వైస్ ప్రెసిడెంట్ ఈశ్వర్ గౌడ్, జనరల్ సెక్రటరీ రాజేందర్ గుప్త, గౌరవ సలహాదారు నర్సింహా చార్యులు, టెంపుల్ ప్రెసిడెంట్ విజయ్ రెడ్డి, రంజిత్ సాగర్, రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.