శేరిలింగంపల్లి, డిసెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ నడిగడ్డ తండాలో ఉన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంసిపిఐ(యు)పార్టీ మియాపూర్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ అధ్యక్షతన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఏ ఐ ఎఫ్ డి డబ్ల్యూ ) రాష్ట్ర నాయకులు తాండ్ర కళావతి, డి లక్ష్మి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ తన జీవితాన్ని దళితుల అభ్యున్నతి కోసం త్యాగం చేశారని అన్నారు. మనుధర్మాన్ని తుద ముట్టించడం కోసం, సమాజంలో దళితులు గౌరవంగా బ్రతకడం కోసం, సమాజంలో మహిళ లు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగడం కోసం అంకితం చేశాడని అన్నారు. రాజ్యాంగంలో ఎన్నో హక్కులు పొందుపరచారని, అగ్రవర్ణాలపై ఆయన ఎన్నో పోరాటాలు జరిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో యంసిపిఐ(యు)పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి టీ అనిల్ కుమార్, కార్యదర్శి వర్గ సభ్యులు వి తుకారాం నాయక్, పల్లె మురళి, సభ్యులు యార్లగడ్డ రాంబాబు, దళిత సంఘ రాష్ట్ర నాయకులు లాలయ్య, నడిగడ్డ తాండ స్థానిక నాయకులు, నాయిని రత్న కుమార్, సుధాకర్, ఆంజనేయులు, గుగులోత్ రవి నాయక్, అబ్రహం, కమలాకర్, విల్సన్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






