శేరిలింగంపల్లి, డిసెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ లో స్థానిక ప్రజా సమస్యలపై గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కాలనీ వీధుల్లో పర్యటించి అక్కడి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు తమ కాలనీలో నూతన సివరేజి పైప్ లైన్ ఏర్పాటు చేసి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని చేసిన ఫిర్యాదు మేరకు అతి త్వరలో ప్రత్యేక దృష్టి సారించి నూతన పైప్ లైన్లను ఏర్పాటు చేసేందుకు వాటర్ వర్క్స్ అధికారులతో చర్చించి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వీటితో పాటు పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లను పూర్తి చేయాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని కోరారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తక్షణమే స్పందించి అక్కడే ఉన్న అధికారులకు వాటిని నోట్ చేసుకొని వీలైనంత త్వరగా అందుకు అవసరమైన నిధులు కేటాయించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా డ్రెయినేజీ పైప్ లైన్ డయా పెంచి లెవల్స్ తో అనుసంధానం చేస్తూ ఒక కాలనీ నుండి మరొక కాలనీకి మధ్యన ఇబ్బందులు తలెత్తకుండా పనులు ప్రణాళిక బద్దంగా అన్ని కాలనీలకు దశలవారీగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ఏఈ భాస్కర్, నేతాజీ నగర్ అధ్యక్షుడు రామచందర్ యాదవ్, ఉపాధ్యక్షుడు రాయుడు, సీనియర్ నాయకులు శేఖర్, నరసింహ, వర్క్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, స్థానిక నేతలు, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.





