స‌మాజంలో అజ్ఞానాంధకారాలను తొలగించేందుకు జ్ఞానజ్యోతులు వెలిగించిన‌ మార్గ‌ద‌ర్శి జ్యోతిరావు పూలే: తుకారం నాయ‌క్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ఎంసీపీఐ(యూ) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో మియాపూర్ ఎంఏ నగర్ పార్టీ కార్యాల‌యంలో మహాత్మ జ్యోతిరావు పూలె 194వ జయంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్బంగా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వి.తుకారాం నాయక్ మహాత్మా జ్యోతిరావు పూలె చిత్ర ప‌టానికి ఘ‌న నివాళుల‌ర్పించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ మహాత్మా జ్యోతి రావ్ పూలే 150 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాల అభివృధి కొరకు, కుల వ్య‌వ‌స్థ‌ నిర్ములన కొరకు, స్త్రీ జాతి విముక్తి కొరకు, స్త్రీ విద్య కొరకు పోరాడిన మహనీయుడ‌ని అన్నారు. తన భార్య‌తోనే చదువు ప్రారంభించి ఉచితంగా వసతి గృహాలు ఏర్పాటు చేసి, వేలాది మంది మహిళలకు విద్యను అందించిన విద్యావేత అన్ని కొనియాడారు. ఈ దేశనికి మొట్ట మొదటి మహిళ ఉపాధ్యాయులిని అందించి స్త్రీలో చైతన్యనికి పునాది వేశాడ‌ని, విద్య లేనిదే పురోగతి లేదని, విద్యతోనే ఈ దేశానికి పట్టిన అజ్ఞానాంధకారాలను తొలగించేందుకు జ్ఞానాజోతిలు వెలిగించ మార్గ‌ద‌ర్శి పూలే అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రేటర్ కమిటీ కార్య వర్గ సభ్యులు కుంభం సుకన్య, పుష్ప, మధుసూదన్, ప‌ల్లే మురళి, లావణ్య, ఈశ్వ‌ర‌మ్మ‌, సీతారాం నాయక్, మధు నాయక్‌, న‌ర్సింహా, సుధాకర్, పి నాయక్, త‌దితరులు పాల్గొన్నారు. అనంత‌రం నడిగడ్డ తండాలోను పూలే చిత్ర‌పాటిని వారు నివాళుల‌ర్పించారు.

జ్యోతిరావు పూలే చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పిస్తున్న తుకారం నాయ‌క్‌, ప‌ల్లె ముర‌ళి త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here