శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత, ఉద్యమకారుడు, ప్రజాస్వామిక మానవతావాది ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా ఆల్విన్ కాలనీ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం, తన జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని అన్నారు. ఉద్యమకారుడిగా, ప్రజాస్వామిక వాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడిగా పలుపార్శ్వాలతో కూడిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శనీయమని అన్నారు. సాయుధ పోరాట కాలంలో చాకలి ఐలమ్మతో సహా పలువురికి న్యాయవాదిగా సేవలందించి వారి తరఫున న్యాయపోరాటం చేసిన ప్రజాస్వామిక వాది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, దొడ్ల రామకృష్ణ గౌడ్, జిల్లా గణేష్, మహమ్మద్, కరీం, బిక్షమయ్య, ఆంజనేయులు, ప్రకాష్ , శివశంకర్, వంగరి విష్ణు, రాములు, వెంకటేశ్వర్లు, నవీన్, నర్సింగరావు, వెంకటనర్సిహ్మ, మోహన్, శ్రీనివాస్, నోముల ఆంజనేయులు , దయానంద తదితరులు పాల్గొన్నారు.






