శేరిలింగంపల్లి, జనవరి 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయిదుర్గం కట్ట మైసమ్మ ఆలయంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ ప్రజలపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండేలా చూడాలని వేడుకున్నానని తెలిపారు. గ్రామ దేవతలను పూజించడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలలో భాగమని అన్ని అన్నారు. గచ్చిబౌలి డివిజన్ లో ఆలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు..ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలుపెద్దసంఖ్యలో పాల్గొన్నారు.






