శేరిలింగంపల్లి, జనవరి 17 (నమస్తే శేరిలింగంపల్లి): యాదవులు రాజ్యాలు ఏలారు, బీసీలు రాజ్యాలు ఏలారు, ఇప్పటికైనా యాదవులు ,బీసీలు ఏకమై రాజ్యాధికారం సాధించాలని బేరి రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు. శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో బీసీ భవన్ లో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. శ్రీ కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి చెందిన గొప్ప చక్రవర్తి, ఆయన పాలనలో సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి చేరింది, ఆయన ఆంధ్ర భోజుడిగా, సకల కళా వల్లభుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఆయన ఆముక్తమాల్యద వంటి గొప్ప గ్రంథాలను రచించారు. ఆయనను గొప్ప రాజుగా, సాహితీ ప్రియుడిగా తెలుగు ప్రజలు అభిమానిస్తారని, ఆయన పాలనలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నతస్థితికి చేరుకున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకుడు కే నరసింహ యాదవ్, బిసి యువజన నాయకుడు బేరి చంద్రశేఖర్ యాదవ్, బేరి సహస్ర యాదవ్, బీసీ నాయకులు పాల్గొన్నారు.






