శేరిలింగంపల్లి, జనవరి 18 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని రోలింగ్ హిల్స్ వద్ద జరిగిన కొరియా ASEZ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జీరో ప్లాస్టిక్ 2040 COMPAIGN & Clean up activity కార్యక్రమంలో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస రావు , ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ రోలింగ్ హిల్స్ ప్రాంతంలో ASEZ దేవుని సంఘం ప్రపంచ పరిచర్య సంస్థకు చెందిన విద్యార్థి స్వచ్ఛంద సేవా విభాగం ఆధ్వర్యంలో Zero Plastic 2040 క్లీనప్ క్యాంపెయిన్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. ప్లాస్టిక్ రహిత భవిష్యత్తు కోసం యువత ముందుండి నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దక్షిణ కొరియా నుంచి వచ్చిన ASEZ సభ్యులు అనోక్, విశాల్, జాషువ, టియో, కృపాకర్, సతీష్, ఆశిష్ , AMOH నగేష్ నాయక్, నాయకుడు నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.






