శేరిలింగంపల్లి, అక్టోబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని భారత్ నగర్ లో ముకేశ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో CHROM WELL HOSPITAL (క్రోమ్ వెల్ హాస్పిటల్) అమీన్ పూర్, Ferty9(Fertility Centre) కూకట్ పల్లి అనుభవజ్ఞులైన డాక్టర్స్ సౌజన్యంతో మహా మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు. అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ టి. పాండురంగారెడ్డి ఈ మెగా క్యాంపును ప్రారంభించారు . మాజీ కౌన్సిలర్ కొల్లూర్ మల్లేష్ ముదిరాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమీన్‌పూర్‌లోని జ్యోతి ఫార్మసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో టి.ఆర్. పి. ఎస్. స్టేట్ ప్రెసిడెంట్ డా వెంకట్ రెడ్డి, అమీన్ పూర్ గ్రామ నాయకులు, గ్రామ వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరంలో స్థానికులు పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో సుమారుగా 146 మంది వృద్ధులు, చిన్నారులు, మహిళలు పాల్గొన్నారు. వారికి షుగర్, బీపీ, దగ్గు, జ్వరం, బీపీ, వెయిట్, హైట్ తదితర పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు భార్గవి, సుజాత, జయశ్రీ, కుస్మా, శాంత, బాలకృష్ణా రెడ్డి, సంగమేష్, మాధవి, అమృత, రాజు, గోవర్ధన్, హాస్పిటల్ సిబ్బంది, ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.






