నమస్తే శేరిలింగంపల్లి: కరోనా సెకెండ్ వేవ్ ఉదృతి నేపథ్యంలో రోజు రోజుకు కరోనా పాజిటీవ్ కేసులు బారీగా నమోదు అవుతున్నాయి. ఐతే కేసుల విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ మనోధైర్యంతో పోరాడితే కరోనా నుంచి సింప్‌ల్‌గా బయటపడొచ్చని వైద్యులు ఎంత చేబుతున్న ప్రతికూల అంశాలనే పరిగణలోకి తీసుకుని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. వంద మంది రోగులలో ఒక్కరు చనిపోతే వ్యాది నయమైన 99 మందిని వదిలేసి ఒక మృతదేహం పైనే దృష్టి సారిస్తూ ఆందోళనలో పడుతున్నారు. ఈ నేపథ్యంలో 99 సంవత్సరాల ఓ వృద్ధురాలు కరోనాను జయించి ఇతరులలో ధైర్యాన్ని నూరిపోస్తుంది.
మదీనగుడలో నివాసముండే సీతారత్నం వయసు 99 సంవత్సరాలు. ఆమె స్పల్ప అనారోగ్యానికి గురవ్వడంతో ఆమె కూతరు సుధారాణి చంద్రశేఖర్ దంపతులు ఐదు రోజుల క్రితం స్థానిక ప్రణామ్ హాస్పిటల్స్‌లో చేర్పించారు. ఆమెకు కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. వైద్యుల సూచనలు పాటిస్తూ తగిన చికిత్స తీసుకున్న సీతారత్నం శుక్రవారం కరోనా నెగెటివ్‌తో డిస్చార్జీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి ప్రతికూల వాతావరణంలోనూ ఆత్మస్థైర్యంతో కరోనాను జయించిన సీతారత్నం లాంటి తల్లులను ఆదర్శంగా తీసుకోవాలే తప్ప వందలో ఒకరు మృతిచెందితే వారిని ఊహించుకుంటు కలత చేందొద్దని ఇక్కడ గుర్తించాల్సిన అంశం.