శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (TRSV) రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు చేవెళ్ల ఎంపి డాక్టర్ రంజిత్ రెడ్డిని కలిశారు. సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు మొదలు అవుతున్న నేపథ్యంలో విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ దరిస్తూ ప్రభుత్వ, వైద్య ఆరోగ్య శాఖ నియమాలను పాటించాలని ఎంపి సూచించారు. ఇదే విషయంపై ఆదివారం తన నివాసంలో విద్యార్థి నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో TRSV రాష్ట్ర నాయకుడు జాహీరుద్దీన్ పాల్గొన్నారు.






