సీసీ కెమెరాలతో భ‌ద్ర‌త‌: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

హైదర్ నగర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్ర‌తి కాల‌నీలో ప్ర‌జ‌లు సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సూచించారు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున హోమ్స్ ఓనర్స్ సెంట్రల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో రూ.2 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన 23 సీసీ కెమెరాలను కూకట్‌ప‌ల్లి జోన్ ఏసీపీ సురేందర్ రావు, సీఐ లక్ష్మీ నారాయణ, కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుల‌తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ సీసీ కెమెరాలు ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ‌ను అందిస్తాయ‌న్నారు. సీసీకెమెరాలను ఏర్పాటు చేసుకుంటే నేరాలు జ‌రిగిన‌ప్పుడు త్వ‌ర‌గా నేర‌స్థుల‌ను గుర్తించేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున హోమ్స్ ప్రెసిడెంట్ ఓంకార్, జనరల్ సెక్రటరీ కుమార్, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రావు, కోశాధికారి వినోద్, అడ్వైజర్లు మురళీధర్, రాంబాబు, కమిటీ సభ్యులు వెంకటేశ్వర్ రావు, లలిత, సీత, అపార్ట్మెంట్ వాసులు వాసు, హరి ప్రసాద్, లక్ష్మణరావు, శ్రీనివాస్, తెరాస నాయకులు కోనేరు కృష్ణ ప్రసాద్, నర్సింహ రావు, సుబ్బారాయుడు, శ్రీనివాస్, శ్రీహరి, బాబు, కృష్ణ రావు పాల్గొన్నారు.

సీసీ కెమెరాల‌ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు
కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here