శేరిలింగంపల్లి, మార్చి 30 (నమస్తే శేరిలింగంపల్లి): విశ్వావసు నామ నూతన సంవత్సర (తెలుగు) ఉగాది పర్వదినం సందర్భంగా మియపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఆయన నివాసంలో పలువురు మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది పర్వదినం శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో శ్రీల గార్డెన్ కాలనీ వాసులు, ఫణి కుమార్, చేతన్, రాఘవరెడ్డి, వంశి, ప్రసాద్, మియాపూర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యకుడు నరేష్ నాయక్, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.