మ‌సీదుల వ‌ద్ద అన్ని ఏర్పాట్లు చేయాలి.. అధికారుల‌కు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆదేశాలు..

శేరిలింగంపల్లి, మార్చి 30 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): రంజాన్ పర్వదినం సందర్భంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్ కాలనీలో ఉన్న ఈద్గా లో జరుగుతున్న ఏర్పాట్లను సీనియర్ నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసంను పురస్కరించుకుని ఈద్గాల వద్ద, మసీదు ల వద్ద అన్ని రకాల ఏర్పాటు చేశామని ఎటువంటి లోటు రాకుండా అన్ని సౌకర్యాలు , మౌళికవసతులు కల్పించాలని, ప్రార్ధనలు చేసుకోవడానికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సాంబశివరావు, ఖాసీం, అక్కారావు, బృందారావు, సత్యం గుప్తా, సయ్యద్ రిజ్వాన్, కాజా, మియన్ పటేల్, బాబూమియా , ఉమ , రాములు, కార్యకర్తలు, ముస్లింలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here