శేరిలింగంపల్లి, జూలై 2 (నమస్తే శేరిలింగంపల్లి): పటాన్‌చెరులోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడి శేరిలింగంపల్లిలోని మదీనాగూడ ప్రణామ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను టీపీసీసీ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్, టీపీవైసీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దుర్గం శ్రీహరి గౌడ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. చందానగర్ డివిజన్ శేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. యువ కాంగ్రెస్ నేతలు సౌందర్య రాజన్, సాయి కిషోర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాధితులు, వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు.