నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ కాలనీలో హెచ్ ఎం డబ్ల్యు ఎస్ అండ్ ఎస్ బీ వారి ఆధ్వర్యంలో రూ. 27 లక్షల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టనున్న మంజీర మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్, జలమండలి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన మంచి నీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కాలనీలో మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జనరల్ మేనేజర్ రాజశేఖర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణ, మేనేజర్ నివర్తి, మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, కొండాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ అబ్బుల కృష్ణగౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఊట్ల కృష్ణ, పేరుక రమేష్ పటేల్, జె. బలరాం యాదవ్, నరసింహ సాగర్, జంగంగౌడ్, బసవరాజు, బుడుగు తిరుపతి రెడ్డి, నందు, సాగర్ చౌదరి, గణపతి, తిరుపతి యాదవ్, రవి శంకర్ నాయక్, చారీ, వెంకట్, కుమార్, సరోజరెడ్డి, విజయ్ కుమార్, విజయ్, సయ్యద్ ఖాసీం, జుబేర్, వినోద్, రవి తదితరులు పాల్గొన్నారు.