నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ సాయి నగర్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పేర్కొన్నారు. సాయినగర్ లో బిజెపి నాయకులు పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు చట్టవిరుద్ధంగా అక్రమ కట్టడాలు నిర్మిస్తూ ఇష్టారాజ్యంగా జీహెచ్ఎంసీ అధికారుల అనుమతి లేకుండా రోడ్లను తవ్వడం వలన నీరు అవుట్ లెట్ లేక పక్కన ఉన్న అపార్ట్మెంట్ సెల్లార్ లోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కాలనీ వాసులు వాపోయారు.
రవి కుమార్ యాదవ్ స్పందించి అధికారులతో మాట్లాడి ఈ చర్యకు పాల్పడిన ప్రైవేటు వ్యక్తుల పై చర్య తీసుకొని త్వరితగతిన రోడ్లను పునర్నిర్మించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. కాలనీలో అనధికారికంగా నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్ తో కాలనీ వాసుల సమక్షంలో మాట్లాడి డ్రైనేజీ లైన్ ను తీసేసి రోడ్లను యధావిధిగా మూడు రోజుల్లో నిర్మించాలని మందలించారు. పనిచేయని పక్షంలో తానే స్వయంగా వచ్చి పనులను పూర్తి చేయిస్తానని కాలనీ వాసులకు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో నవీన్, బాలరాజు, స్థానిక కాలనీ వాసులు, అపార్ట్మెంట్ వాసులు నాగుల్ గౌడ్, నవతా రెడ్డి, కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, రాంరెడ్డి, లక్ష్మి, లక్ష్మణ్ ముదిరాజ్, వినోద్ యాదవ్, గణేష్ ముదిరాజ్, రవి గౌడ్, అశోక్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.