సిద్దిపేట (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణను సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ నేత, సంస్థ జిల్లా కోఆర్డినేటర్, సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజును మామిడి హరికృష్ణ సన్మానించారు. అనంతరం రాజు మాట్లాడుతూ మామిడి హరికృష్ణ చేతుల మీదుగా సన్మానం జరగడం జీవితంలో మరవరానిదని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు ఆశయాలకోసం జీవితాంతం నిరంతరంగా పని చేస్తామని తెలిపారు.
