గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్‌మోహర్ పార్క్, నేతాజీ నగర్ కాలనీ ప్రజలకు చందానగర్ పీఆర్‌కే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా నేతాజీనగర్ కాలనీ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. అందుకోసమే హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందన్నారు. రెండు కాలనీల ప్రజలు చుట్టుపక్కల కాలనీ వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది జి కేశవులు, సౌమ్య గరిమ, కాలనీ ఉపాధ్యక్షులు మోహన్ రావు, అబ్దుల్ హక్, కుమార్ ముదిరాజ్, యువజన నాయకులు నాగరాజు, వెంకటేష్, రమణ, అశోక్, మూర్తి, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. హాస్పిటల్ యాజమాన్యానికి భేరి రామచందర్ యాదవ్ ధన్యవాదాలు తెలియజేశారు.
