నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పేట్ గ్రామంలో నెలకొన్న నీటి కొరత సమస్యను తీర్చాలని కోరుతూ శుక్రవారం మియాపూర్ బిజెపి డివిజన్ కార్యవర్గం సభ్యులు జలమండలి జనరల్ మేనేజర్ రాజశేఖర్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. మక్త గ్రామంలోని ఎస్సీ బస్తీలో కొన్ని రోజుల నుండి బోర్ పాడవడం వల్ల అక్కడి ప్రజలు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బోర్ ను వెంటనే మరమ్మతు చేసి నీటి సమస్య తీర్చాలని కోరారు. సమస్య పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి కొత్త పైప్ లైన్ నిర్మాణానికి మంజూరు చేయాలని కోరారు. సంబంధిత అధికారులను పంపించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో బిజెపి డివిజన్ అధ్యక్షుడు మాణిక్ రావు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ కలివేముల మనోహర్, హఫీజ్ పేట్ అధ్యక్షుడు శ్రీధర్, నాయకులు గుండె గణేష్ ముదిరాజ్, రవి గౌడ్, లక్ష్మణ్, రామకృష్ణ, అశోక్, విజేందర్ , అంజయ్య, రమేష్, శేఖర్ స్థానికులు పాల్గొన్నారు.