ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి: కార్మిక సంఘాల పిలుపు

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ పరిధిలోని ముజఫర్ అహ్మద్ నగర్ తాండ్ర రామచంద్రయ్య స్మారక భవనం ఏ.ఐ.సి.టి.యు కార్యాలయంలో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న దేశవ్యాప్త‌ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జ‌ర‌గనున్న సమ్మెను విజయవంతం చేయాలని సమావేశం నిర్వహించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం- 2025, విబి జి-రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసిలో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించడం లాంటి ప్రమాదకర నిర్ణయాలను ఉపసంహరించాలని అన్నారు. కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికవర్గం మొత్తం పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు పర్వతాలు, ఏ.ఐ.సి.టి.యు రాష్ట్ర అధ్యక్షుడు తుడుం అనిల్ కుమార్, సి ఐ టి యు నాయకుడు కొంగరి కృష్ణ, ఏఐటియుసి నాయకుడు చందు యాదవ్, ఏఐసిటియు గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కర్ర దానయ్య, టి ఆర్ ఎస్ కె.వి నాయకుడు వంశీకృష్ణ , సిఐటియు నాయకుడు వరుణ్ , ఏఐసిటియు నాయకుడు జి.శి వాని, కన్నా శ్రీనివాస్ , తుకారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here