శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 4 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని RBR కాంప్లెక్స్ 4వ బ్లాకులో మహిళలకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిటిజన్ హాస్పిటల్, అమెరికన్ ఆంకాలజీ ఇన్సిట్యూటుకు చెందిన రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మల్లిక్ సింగరాజు హాజరై ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తూ WHO, వరల్డ్ క్యాన్సర్ ఫెడరేషన్ ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారని అన్నారు. మన శరీరంలోని కణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోవడమే క్యాన్సర్ వ్యాధి అని అన్నారు. మొదటిదశలోనే వ్యాధి గుర్తింపబడి, చికిత్స చేయించుకొని ఆరోగ్యంగా జీవిస్తున్నవారు వేలసంఖ్యలో ఉన్నారు. ఈ వ్యాధి బారిన పడినవారు భయపడకుండా పూర్తి అవగాహనతో ధైర్యంగా ఎదుర్కోవాలి. ముందస్తు జాగ్రత్తే ఉత్తమ రక్షణ అని అన్నారు. ఈ సందర్భంగా అందరిచేత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుందాం – క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంచుకుందాం, పంచుకుందాం.. అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అపార్ట్ మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాసరావు, మున్నాభాయ్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కస్తూరి, రఘునాధరావు, విష్ణు ప్రసాద్, శివరామ రెడ్డి, హాస్పిటల్ ప్రతినిధులు శ్రీశైలం, జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.






